TSLPRB SI Exam: తెలంగాణలో పూర్తయిన ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్..

TSLPRB SI Exam: తెలంగాణ వ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా పూర్తయింది. ఐతే నిమిషం నిబంధనతో చాలామంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. లేట్‌గా వచ్చిన స్టూడెంట్లను అధికారులు ఎగ్జామ్ హాళ్లోకి అనుమతించలేదు. కొన్నిప్రాంతాల్లో దయచేసి లోపలికి పంపడంటూ అభ్యర్థులు వేడుకున్నారు. కానీ తామేం చేయలేమని అధికారులు చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.
సూర్యాపేట జిల్లా కోదాటలో ఓ అభ్యర్థి పది నిమిషాలే లేటుగా వచ్చాడు. ఐనా అతనికి నిరాశ తప్పలేదు. అధికారులు అతన్ని ఎగ్జామ్ హాల్‌కు అనుమతించలేదు. గూగుల్ మ్యాప్‌లో వేరే సెంటర్ చూపించడం వల్ల తాను ముందుగా అక్కడి వెళ్లానని అందుకే ఆలస్యమైందని వాపోయాడు. తనను అనుమతించాలని వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
సంగారెడ్డి పరీక్షా కేంద్రానికి ముగ్గురు అభ్యర్థులు లేటుగా వచ్చారు. దీంతో వారిని అధికారులు అనుమతించలేదు. అటు సిద్దిపేట జిల్లా ములుగులోనూ ఓ విద్యార్థికి ఇదే పరిస్థితి ఎదురైంది. అటు ఆభరణాలు వేసుకొచ్చిన మహిళా అభ్యర్థుల్ని లోపలికి అనుమతించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాళిబొట్లు తీస్తేగానీ పోలీసులు వారిని ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com