TSPSC లీక్: తీగలాగితే డొంక కదిలింది.. బయట పడుతున్న లీకు వీరుడి రహస్యాలు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తీగలాగితే డొంక కదిలినట్లు మారింది. ఆరా తీస్తున్న కొద్ది పేపర్ లీక్స్ బయట పడుతున్నయి. ఇటీవలే ఏఈ పేపర్ రేణుక అనే యువతి వల్లే లీక్ అయినట్లు సమాచారం. 2017 లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన ప్రవీణ్ మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని అడ్డగోలు దందాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్1 పరీక్ష పేపర్ కూడా లీకైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లీకేజ్ మాస్టర్ ప్రవీణ్ కూడా గ్రూప్1 పరీక్ష రాశాడు. రాసినప్పటికీ కొన్ని కారణాలతో అతడు క్వాలిఫై కాలేకపోయాడు. అయితే లీకువీరుడు ప్రవీణ్ రాసిన ప్రిలిమ్స్ ఎక్సామ్ పేపర్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రవీణ్ ఫోన్‌ను పోలీసులు చెక్ చేయడంతో విచ్చలవిడిగా నగ్నచిత్రాలు, అసభ్య చాటింగ్‌లు బయట పడ్డాయి. దీంతో అతని ఫోన్‌ను ఫోరెన్‌సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ నెల 25 తరువాత ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక రానున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఆ నివేదిక ఆధారంగానే గ్రూప్1 పేపర్ లీక్ వ్యవహారం ఆధారపడి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com