TSPSC : నిందితులకు మూడు రోజుల కస్టడీ

TSPSC : నిందితులకు మూడు రోజుల కస్టడీ

TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి నాంపల్లి కోర్టు పోలీస్‌ కస్టడీ విధించింది. ప్రశాంత్‌, రాజేందర్‌, తిరుపతయ్యలను మూడు రోజుల కస్టడీకి అనుమతి ని ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ముగ్గురిని చంచల్‌గూడ జైలు నుంచి సిట్‌ కస్టడీకి తీసుకోనుంది. ఈ నెల 6 వరకు ముగ్గురిని సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు.

అటు TSPSC ఛైర్మన్‌ వాంగ్మూలం నమోదు ప్రక్రియ పూర్తి అయింది. TSPSC ఛైర్మన్‌ జనార్ధన్ రెడ్డి వాంగ్మూలాన్ని సిట్‌ అధికా రులు నమోదు చేశారు. పేపర్‌ లీకేజీ కేసులో ఛైర్మన్ వాంగ్మూలం ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో నమోదు చేశారు. 3 గంటలపాటు వాంగ్మూలం తీసుకున్నారు సిట్‌ అధికారులు.

TSPSC కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు నిందితుడు ప్రవీణ్‌ పీఏ. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కార్యదర్శి పాత్ర కీలకంగా మారిందని తేలింది. ప్రవీణ్ గ్రూప్‌-1 పరీక్ష రాస్తున్నప్పటికీ సెలవుపై ఎందుకు పంప లేదని సిట్‌ అధికారులు ప్రశ్నిం చారు. అతడికి 100 మార్కులు వచ్చినా అనుమానం రాకపోవడానికి కారణాలు ఏంటని అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించారు. పేపర్‌ లీకేజీలో కీలక నిందితుడు రాజశేఖర్ రెడ్డి, లీకైన ప్రశ్నాపత్రంతో పరీక్ష రాసిన సురేష్ ఇద్దరూ టీఎస్‌పీఎస్సీలో ఒప్పంద ఉద్యోగులేనని అధికారులు గుర్తించారు. ఒప్పంద ఉద్యోగుల నియామకం, ఎంపిక ప్రక్రియపై అనితా రామచంద్రన్‌ నుంచి వివరాలు సేకరించారు.

Next Story