TSPSC : కేసును స్పీడప్ చేసిన సిట్ అధికారులు

TSPSC : కేసును స్పీడప్ చేసిన సిట్ అధికారులు
కింగ్‌ కోఠి ఆసుపత్రి లో నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్‌‌లో స్పీడ్ పెంచారు. ఈ కేసులో ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా జల్లెడ పడుతున్న సిట్ బృందం. మరోవైపు మూడు రోజుల పాటు నిందితులను కస్టడికి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో కాసేపట్లో చంచలగూడ నుంచి సిట్‌ కార్యాలయానికి నిందితులను తరలించనున్నారు. మొదట కింగ్‌ కోఠి ఆసుపత్రి లో నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.పేపర్‌ విక్రయాలపై, ఆర్ధిక లావాదేవీలపై కూడా ఫోకస్‌ పెట్టారు సిట్‌ అధికారులు.

నిందితులను రెండు దఫాలుగా కస్టడీకి తీసుకున్న సిట్.. అన్ని కోణాల్లో విచారించారు. టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగం చేస్తూ.. గ్రూప్ 1 పరీక్ష రాసిన షమీమ్, రమేష్ లతో పాటు మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ లకు ఐదు రోజుల కస్టడీ ముగియడంతో సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం చెంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ ముగ్గురికీ కస్టడీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే.. కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇంఛార్జి శంకర లక్ష్మిని కూడా పలుసార్లు విచారించారు. టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగుల నిర్లక్ష్యంపై దృష్టి సారించిన సిట్.. బోర్డ్ సభ్యులను సైతం విచారించి, వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. షమీమ్ నివాసంలో జరిపిన సోదాల్లో.. ఏకకంగా మాస్టర్ ప్రశ్నాపత్రం లభించడంతో.. టీఎస్‌పీఎస్‌సీలో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది.

Tags

Read MoreRead Less
Next Story