TSPSC పేపర్ లీక్ కేసులో ఈడీ ఎంటరైంది

TSPSC కేసులో నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. మార్చ్ 23న CCS ఏసీపీకి ఈడీ లేఖ రాసింది. TSPSC కేస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరింది. మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారం, ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన ప్రాథమిక వివరాలతో ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేయనుంది ఈడీ. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లను.. నలుగురు అధికారుల బృందం విచారిస్తుందని కోర్టుకు తెలిపింది. TSPSC పేపర్ లీకేజ్‌లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అభియోగం మోపింది. సెక్షన్ 48, 49 కింద ఈడీకి విచారించే అర్హత ఉందని కోర్టుకు వివరించింది. జైలులో విచారణ సందర్భంగా ల్యాప్‌టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాలని కోరింది. జైలులో విచారణ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని.. చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ విన్నవించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com