TSPSC పరీక్షలు రద్దు చేయడం సబబే: హైకోర్టు

TSPSC పరీక్షలు రద్దు, వాయిదా సబబేనని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించిది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారించింది. సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సిట్ దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి, మంత్రి కేటీఆర్ జోక్యం ఉందన్నారు. మంత్రి చెప్పినట్లే సిట్ దర్యాప్తు చేస్తోందని... లీకేజీలో ఇద్దరికే ప్రమేయం ఉందని కేటీఆర్ ముందే చెప్పారని కోర్టుకు తెలిపారు. ఐటీ అంశాలపై దర్యాప్తునకు సిట్‌లో సాంకేతిక నిపుణులు లేరని కోర్టుకు వివరించారు.
ఇక విచారణలో భాగంగా ఇప్పటివరకు సిట్ 40 మంది సాక్షులను ప్రశ్నించిందని ప్రభుత్వం తరపున హైకోర్టుకు ఏజీ తెలిపారు. 12 కంప్యూటర్లను సిట్ సీజ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక సిట్‌లో ఐటీ నిపుణులు ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. ఐటీ అంశాల దర్యాప్తునకు మళ్లీ ఔట్ సోర్సింగ్‌కు వెళ్తారా? అని వ్యాఖ్యానించింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎందుకు విచారణకు పిలిచారని ప్రశ్నించింది. ఇక నేతల నుంచి ఏదైనా సమాచారం సేకరించారా అని వివరణ కోరింది. ఇక ఈ వ్యవహారంపై ఈ నెల 28న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com