TSPSC పేపర్‌లీక్ కేసులో కీలక పరిణామం

సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. వీరిద్దర్నీ దాదాపు 12 గంటలుగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. ప్రశ్నా పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల తదితర అనేక అంశాలపై వీరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నగదు లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ లీకేజీలో ఇప్పటివరకు 38లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించారు. దీని ఆధారంగా మనీలాండరింగ్ కోణంలోనే విచారణ చేపట్టిన ఈడీ.. తాజాగా కమిషన్ ఛైర్మన్, కార్యదర్శిని విచారించింది. వీరిద్దరి వాంగ్మూలాలు తీసుకున్నారు ఈడీ అధికారులు. లీకేజీ గురించి కమిషన్ అధికారులు ఎందుకు పసిగట్టలేకపోయారు, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఈడీ అడిగినట్లు తెలుస్తోంది. ఇద్దరీని వేర్వేరుగానా, అనంతరం కలపి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో.. ఏకంగా పబ్లిక్ సర్వీ కమిషన్ ఛైర్మన్, కార్యదర్శులను ఈడీ ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ కేసులో సిట్ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. తొలుత న్యాయస్థానం నుంచి ఎఫ్‌ఐఆర్ తీసుకున్న ఈడీ ఆ వివరాల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదుచేసింది. అనంతరం తొలుత టీఎస్‌పీఎస్సీ కార్యాలయం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్‌ఛార్జి శంకరలక్ష్మిని విచారించింది. శంకరలక్ష్మితో పాటు లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణకు నోటీసులు జారీచేసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ విధివిధానాల గురించి.. ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అయ్యాయనే విషయాలపై వీరిద్దర్నీ ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులను చంచల్‌గూడ జైలులో విచారించిన ఈడీ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com