TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ అధికారుల దూకుడు

TSPSC పేపర్ లీక్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిందితులతో పాటు కమిషన్ సభ్యులను విచారిస్తున్నారు. ఇప్పటికే ముగురు నిందితులను సిట్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో వారి నుంచి కూపీలాగుతున్నారు. కమిషన్ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్ ను ఐదో రోజు విచారిస్తున్నారు. గ్రూప్ వన్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి షమీమ్, రమేష్, సురేష్‌ను విచారించిన అధికారులు.. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తోంది.. నేటితో నిందితుల కస్టడీ ముగియనుండటంతో.. మరోమారు కస్టడీకి కోరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇక ఈ కేసులో మరింత కొంత మందిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు, వారిని కూడా కస్టడీకి కోరింది. తొలుత ప్రవీణ్, రాజశేఖర్, డాక్యతో పాటు రేణుకను విచారించిన సిట్ అధికారులు వారు ఇచ్చిన సమాచారంతోనే మిగతావారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 15మందిని అదుపులోకి తీకున్నారు సిట్ అధికారులు. ఐదో రోజు సైతం ముగ్గురు నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు పేపర్ లీక్ వ్యవహారంలో విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.
మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారంలో ఈడీ కూడా ఎంటరైంది.. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశారు అధికారులు.. నిందితుల బ్యాంక్ ట్రాన్సాక్షన్లపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.. ట్రాన్సాక్షన్ వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు ఈడీ అధికారులు లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com