TSPSC Group 1 : మరికొన్ని రోజుల్లోనే టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష..

TSPSC Group 1 : మరికొన్ని రోజుల్లోనే టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష..
X
TSPSC Group 1 : తెలంగాణలో అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది

TSPSC Group 1 : తెలంగాణలో అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణపై TSPSC ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప‌రీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3లక్షల 80వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 756 మంది చొప్పున పోటీపడుతున్నారు.

గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వ్‌ అయ్యాయి. వీటికి లక్షా 51వేల మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు 672 మంది పోటీపడుతున్నారు. ఇక.. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు.

Tags

Next Story