Tgpsc Group 1 Prelims Exam 2024 : తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్..

Tgpsc Group 1 Prelims Exam 2024 : తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్..
X
పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటలకే గేట్లు క్లోజ్‌

రాష్ట్రంలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 563 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 897 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు. ఉదయం 10 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. గేట్లు మూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తెరిచే ప్రసక్తే లేదని, నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టంచేశారు. నిబంధనల నోట్‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ పరిపాలనలో గ్రూప్-1 పోస్టులకు అధిక ప్రాధాన్యత ఉంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చేవారికోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇదిలాఉంటే.. ఉదయం 10గంటలకు ఎగ్జామ్ సెంటర్లకు తప్పనిసరిగా వెళ్లాలి. కచ్చితంగా 10గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. అదేవిధంగా హాల్ టికెట్ మీద లేటెస్ట్ ఫోటోను అటాచ్ చేయడంతోపాటు గుర్తింపు కార్డును తీసుకురావాలని అధికారులు సూచించారు.

అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు..

హాల్‌టికెట్‌పై లేటెస్ట్‌ ఒరిజినల్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో అతికించాలి.. ఇది తప్పనిసరి.

కలర్‌లో, ఏ4 సైజులో లేదా లేజర్‌ ప్రింటర్‌ ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ప్రిలిమినరీ పరీక్షలు ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. బయోమెట్రిక్‌ ద్వారా అటెండెన్స్‌ను స్వీకరిస్తారు.

ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్‌ స్కాడ్‌, మూడు నుంచి ఐదు కేంద్రాలకు కలిపి ఒక ఫ్లయింగ్‌ స్కాడ్‌ను ఏర్పాటు చేశారు.

అభ్యర్థుల ప్రయాణ సౌకర్యార్థం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు.

కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, మ్యాథమెటికల్‌ టే బుళ్లు, బ్యాగులు, రైటింగ్‌ ప్యాడ్‌లు, ఎలక్ట్రానిక్‌, రికార్డింగ్‌ వస్తువులకు అనుమతి లేదు.

Tags

Next Story