TSPSC Leak: బీఎస్పీ నేత ఆర్‌ఎస్పీ అరెస్ట్
ఈ మేరకు గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ డిమాండ్
తెలంగాణలో గ్రూప్1 పేపర్ లీకులపై విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఈ మేరకు గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నిరసన దీక్షకు సిద్ధమైన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఛాంబర్ లోనుంచి ప్రవీణ్ కుమార్ బయటకు రాలేదు దీంతో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు పోలీసులు. ప్రవీణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని వెళుతుండగా బీఎస్పీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకున్నవారిని పక్కకు ఈడ్చేసి ప్రవీణ్ కుమార్‌ను తీసుకెళ్లారు. దీంతో అక్కడంతా ఉద్రిక్తత ఏర్పడటంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పలువురు బీఎస్పీనేతలను అరెస్ట్ చేశారు.