TSPSC Leak: రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న పేపర్‌ లీక్‌ పంచాయతి

TSPSC Leak: రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్న పేపర్‌ లీక్‌  పంచాయతి
9మంది సభ్యులతో బీజేపీ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. పేపర్‌ లీక్‌పై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు చేపట్టింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ను టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి టార్గెట్‌ చేశారు. సిట్టింగ్‌ జడ్జీతో విరారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుంది. ఈ మేరకు మంగళవారం గవర్నర్‌ను కాంగ్రెస్‌ నేతలు కలవనున్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుంది. పేపర్‌ లీక్‌ వెనక బీజేపీ హస్తం ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. ఇదిలా ఉండగా నిందితుడు రాజశేఖర్‌ భార్య హైకోర్టును ఆశ్రయించింది.

ఇక ఈ వ్యవహారంలో 9మంది సభ్యులతో బీజేపీ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. టీఎస్‌పీఎస్సీ సభ్యుడు విఠల్‌రెడ్డి చైర్మెన్‌గా బీజేపీ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది. ఉద్యోగులకు సాయం చేయడమే లక్ష్యంగా టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుందన్నారు. నిరుద్యోగుల వద్ద ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని కోరింది.

Tags

Read MoreRead Less
Next Story