TSPSC Paper Leak: నాదగ్గర ఉన్న సమాచారం అందించా: రేవంత్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిని సిట్ బృదం గురువారం విచారించింది. గంట పాటు అతన్ని సిట్ అధికారులు ప్రశ్నించారు. అధికమార్కులు సాధించిన అభ్యర్థుల వివరాలను రేవంత్ సిట్‌కు అందించారు. రేవంత్‌కు నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. రేవంత్‌తో పాటు వచ్చిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం నెలకొంది. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. విద్యార్థుల తరుపున కొట్లాడుతున్న మమ్మల్ని ప్రభుత్వం బెదిరిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సిట్ విచారణకు హాజరయ్యానని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com