TSPSC Paper Leak: హైకోర్టులో టీఎస్‌పీఎస్సీ కౌంటరు దాఖలు

TSPSC Paper Leak: హైకోర్టులో టీఎస్‌పీఎస్సీ కౌంటరు దాఖలు
X
వెంకట్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరింది

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ హైకోర్టులో కౌంటరు దాఖలు చేసింది. పేపర్‌ లీకేజీ కేసును సీబీఐకి బదిలీ చేయాంటూ NSUI నేత బల్మూరి వెంకట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కౌంటరు దాఖలు చేయాల్సిందిగా టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. ఈ మేరకు కౌంటరు దాఖలు చేసిన టీఎస్‌పీస్సీ.. వెంకట్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. సమాచారం బయటకి వెళ్లిందన్న అనుమానంతోనే కేసులు పెట్టామని, ముందస్తు చర్యగా 4 పరీక్షలు రద్దు చేసి, మూడు పరీక్షలను వాయిదా వేశామని కోర్టుకు తెలిపింది. పేపర్‌ లీకేజీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెల్లింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సోమవారం మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags

Next Story