TSPSC పేపర్ లీక్ కేసులో మరో నలుగురు అరెస్ట్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరో నలుగురు నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ట్సప్స్సీ పేపర్ కేసులో ఇప్పటివరకు 35 మంది అరెస్ట్ అయ్యారు. ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సిట్ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఏవో పరీక్షల్లో ర్యాంకులు.. అత్యధిక మార్కులు సాధించిన వారిపై దృష్టి పెట్టారు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ DAO పరీక్షలో అత్యధిక మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో తొలి మూడు ర్యాంకులు సాధించారు నిందితులు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజేశ్వర్‌కు మొదటి ర్యాంకు రాగా అతని భార్య శాంతికి రెండో ర్యాంకు వచ్చింది. మరో నిందితురాలు రేణుక స్నేహితుడు రాహుల్ కుమార్‌కు మూడో ర్యాంకు వచ్చింది.
ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు రాజశేఖర్‌కు నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. రాజశేఖర్ భార్య శాంతి, రాహుల్‌తో పాటు మాజీ సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి భార్య సుచరిత, నాగార్జునసాగర్‌కు చెందిన దళారి రమావత్ దత్తులను అరెస్టు చేసిన సిట్ అధికారులు రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాహుల్‌కు గత కొన్నేళ్లుగా రేణుకతో పరిచయం ఉంది. రాహుల్ డీఏవో పరీక్ష రాస్తున్నాడని తెలుసుకున్న రేణుక ఈ ఏడాది ఫిబ్రవరిలో డిఏఓ మాస్టర్ పేపర్‌ను రాహుల్‌కు ఇచ్చింది. ప్రశ్నలు, జవాబులను నోట్ బుక్‌లో రాసుకున్న రాహుల్ .. మూడో ర్యాంకు సాధించాడు. అదే పేపర్‌ను రేణుక భర్త ఢాక్య, రాజశేఖర్ భార్య శాంతి పరీక్ష రాశారు. DAO పేపర్ వీరి నుంచి మరవరికైనా చేరిందా అనే కోణంలో ఆరా తీస్తున్న సిట్ బృందం విచారణ నిమిత్తం ఈ నలుగురిని కస్టడీకి కోరాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com