TSRTC: మొదలైన ఏసీ స్లీపర్ బస్సుల సేవలు

TSRTC తొలిసారి ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. హైదరాబాద్ ఎల్బీనగర్లో మొత్తం 16 బస్సుల్ని మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం ప్రారంభించారు. ఇటీవల ప్రారంభించిన 12 నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే వీటికి లహరి - అమ్మఒడి అనుభూతి అని పేరు పెట్టారు. ప్రయాణీకులకు కొత్త అనుభూతినిచ్చేలా వీటిలో అధునాతన సౌకర్యాలని కల్పించారు. ఉచిత వైఫై తో పాటు ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బటన్ సదుపాయం, సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ వంటి సదుపాయాలున్నాయి.
ఆక్యుపెన్సీ రెవెన్యూ 69 శాతానికి పెరిగిందన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ఏడాది 1067 బస్సులు తెస్తామన్నారు. పల్లెవెలుగు బస్సులు కూడా ఎక్కువగా ఉండేలా చూస్తామన్నారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని సజ్జనార్ వెల్లడించారు. అనంతరం ప్రసంగించిన మంత్రి పువ్వాడ జాతీయ స్థాయిలో టీఎస్‌ఆర్టీసీకి ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్లీపర్ బస్సుల్ని అందుబాటులోకి తెస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com