TSRTC: ఆగస్ట్ 15న పుట్టిన వారికి ఆర్టీసీ బంపరాఫర్..

X
By - Prasanna |9 Aug 2022 4:07 PM IST
TSRTC: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తలపోస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
TSRTC: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తలపోస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 12 రోజులపాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి.
అందులో భాగంగా ఆగస్ట్ 15వ తేదీన పుట్టిన చిన్నారులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. పిల్లలకు 12 సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు కూడా ఈనెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. ఇటీవల బస్సులో పుట్టిన ఓ చిన్నారికి జీవిత కాలం ఉచిత ప్రయాణం కల్పించింది టీఎస్ఆర్టీసీ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com