TSRTC MD Sajjanar: శభాష్ సజ్జనార్.. చిరంజీవిని కూడా సీన్‌లోకి లాగేశారు..

TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీ పేరు ఇప్పుడు మారుమోగింది. కొత్తగా ఆలోచించే తత్వం, వినూత్నంగా ఏదైనా చేయాలనే తపన ఉంటే ఏ విభాగంలోనైనా మనదైన ముద్ర వేయగలమని సజ్జనార్ నిరూపించారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సజ్జనార్ సంస్థను అగ్రభాగాన నిలబెట్టేందుకు అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. ఆర్టీసీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు.
కొత్తగా ఆలోచించడంలో ఎప్పుడూ ముందుండే సజ్జనార్ మీమ్స్ ఉపయోగించడంలో అగ్రగామి. ఆర్టీసీ విషయంలోనూ ఎక్కడా తగ్గేదేలేదంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తున్నారు.
సంక్రాంతికి ధరలు పెంచకుండా ప్రయాణీకులు బస్సుల్లోనే వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని తెలిపే కొన్ని సినిమా పోస్టర్లు, సన్నివేశాలను చూపుతూ ఆర్టీసీ మీమ్స్ తయారు చేసి విడుదల చేస్తున్నారు. సినిమాలోని సీన్ తో ఆర్టీసీ గురించి చెప్పిన దృశ్యాన్ని ఇప్పుడు సజ్జనార్ ఉపయోగిస్తున్నారు.
శారద, చిరంజీవి, ఖుష్బూ, అందరూ బస్సులో ప్రయాణించే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని ఉపయోగించుకుని వినూత్న ప్రచారాన్ని రూపొందించారు. ఆర్టీసీ బస్సులో కనీసం ఒక్కరోజైనా ప్రయాణించి సంస్థ మనుగడకు మన వంతు కృషి చేద్దాం.. అంటూ సజ్జనార్ షేర్ చేసిన వీడియో ట్వీట్ వైరల్ అవుతోంది. సజ్జనార్ ఆలోచనలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మీరు ఎక్కడ ఉన్నా మీ ట్రేడ్‌మార్క్ ఉంటుంది సార్! ఎన్‌కౌంటర్ అయినా, టీఎస్‌ఆర్‌టీసీ బస్ సెంటర్ అయినా.. అంటూ సజ్జనార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
చింత ఎందుకు దండగ మీ #TSRTC ఉండగా ఎటువంటి అవసరానికి అయినా సరే మనమందరం కనీసం ఒక్కరోజు #TSRTCBus లో ప్రయాణం చేసి సంస్థ మనుగడకి మన వంతు కృషి చేద్దాం. @TSRTCHQ @KChiruTweets @khushsundar @NagaBabuOffl @baraju_SuperHit @Chiru_FC @ChiruFanClub @chiranjeeviblog @MegaStarNation pic.twitter.com/iRrjf5BtpT
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 13, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com