TSRTC: బస్సుల్లో వేలాడే బాధలకు చెక్.. మరో 100 బస్సులు..

TSRTC: రద్దీ ప్రాంతాల్లో ఎన్ని బస్సులు తిరిగినా సరిపోవట్లేదు. చాలా మంది విద్యార్ధులు వేలాడుతూ స్కూల్స్‌కి, కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అదనంగా మరో 100 బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. నగర శివార్లలో ఉన్న కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం 12 కారిడార్లుగా విభజించి 350 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉందనే విషయాన్ని అధికారులు ఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మార్గంలో మరో 30 బస్సులు వేయాలని ఎండీ సజ్జనార్ సూచించారు. ఈ విద్యాసంవత్సరం ముగిసే నాటికి రోడ్డు మీదకు మరో 500 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని సజ్జనార్ తెలియజేశారు. ఈ బస్సులను ముఖ్యంగా విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com