తెలంగాణలో రాత్రుల్లో బస్సులు నడపడంపై స్పందించిన టీఎస్ఆర్టీసీ

తెలంగాణలో రాత్రుల్లో బస్సులు నడపడంపై స్పందించిన టీఎస్ఆర్టీసీ
కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అయితే రాత్రుల్లో ఆర్టీసీ బస్సులు నడపడంపై ఆ సంస్థ అధికారులు స్పందించారు.

కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అయితే రాత్రుల్లో ఆర్టీసీ బస్సులు నడపడంపై ఆ సంస్థ అధికారులు స్పందించారు. కర్ఫ్యూ సమయంలో బస్సులు నిలిపివేయడంపై తమకు ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వలేదని ఆర్టీసీ ఈడీ ఆపరేషన్స్ యాదిగిరి అన్నారు. బస్సులు నడపడంపై లోకల్ డిపో మేనేజర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. లాంగ్ రూట్ బస్సులు కర్ఫ్యూ సమయంలో గమ్య స్థానాలకు చేరుకోకపోతే పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికులు ఎక్కువగా ఉంటే బస్సులు నడపాలా వద్దా అనేది ఆలోచిస్తామని యాదిగిరి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story