TSRTC Dasara Special : రైట్.. రైట్.. పండక్కి టీఎస్ఆర్టీసీ 4035 ప్రత్యేక బస్సులు..!

TSRTC Dasara Special : దసరా సెలవులు, బతుకమ్మ పండుగ నేపథ్యంలో... ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ సమయత్తమవుతోంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్నిప్రాంతాలతోపాటు, ఇతర రాష్ట్రాలకు కూడా వీటిని నడపనున్నారు. అదనపు చార్జీలతో 4035 ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అక్టోబర్ 8 నుంచి 14 వరకు స్పెషల్ సర్వీసులు తిరుగుతాయని ఆర్టీసీ ఉన్నతాధికారి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి 3,085 బస్సులు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల ముఖ్య పట్టణాలకు మరో 950 స్పెషల్ సర్వీసులను నడపనున్నారు.
దూరపు ప్రయాణ బస్సుల్లో మాత్రమే రిజర్వేషన్ టికెట్లకు అదనపు చార్జీలు, ఇతర సర్వీసుల్లో సాధారణ చార్జీలు వసూలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. పండుగ రోజుల్లో రద్దీకి అనుగుణంగా సాధారణ బస్సుల్లో సీట్లు నిండిన తర్వాత.. స్పెషల్ బస్సుల రిజర్వేషన్లు ఓపెన్ చేయనున్నట్టు ... ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి తిరిగి ఖాళీగా వస్తాయని...ఆ విధంగా పడే భారాన్ని తగ్గించుకునేందుకే అదనపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
మరోవైపు ప్రత్యేక బస్సుల నిర్వహణ కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఆరంఘర్, ఉప్పల్‌క్రాస్‌రోడ్డు, మియాపూర్, కుషాయిగూడ, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌తదితర ముఖ్యమైన పాయింట్లలో సీనియర్ అధికారులను నియమించనున్నారు. హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్, సెంట్రల్ యూనివర్సిటీ డిపోల నుంచి రాష్ట్రంలోని పలు పట్టణాలకు మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు తిరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com