TSRTC : పండుగ వేళ టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్!

TSRTC : పండుగ వేళ టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు మొత్తం 4,980 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది.

TSRTC Special Buses : సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకి టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8 నుంచి 14 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, ఏపీకి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు మొత్తం 4,980 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. అయితే ఇందులో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు కాగా, ఏపీకి 1,600 బస్సులను నడుపుతున్నట్లు పేర్కొంది. అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకునేందుకు అధికార వెబ్ సైట్ ( www.tsrtconline.in ) లో ఏర్పాట్లు చేసినట్టుగా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story