TSRTC Special Buses: న్యూ ఇయర్ జోర్దార్.. మందుబాబుల కోసం ఆర్‌టీసీ స్పెషల్ బస్సులు..

TSRTC Special Buses: న్యూ ఇయర్ జోర్దార్.. మందుబాబుల కోసం ఆర్‌టీసీ స్పెషల్ బస్సులు..
X
TSRTC Special Buses: తెల్లవారుజాము 3 గంటల వరకు బస్సు సేవలు అందించనుంది.

TSRTC Special Buses: డిసెంబర్ 31 ఫస్ట్ నైట్.. తెల్లవారితే కొత్త ఏడాదిలోకి అడుగుపెడతాం.. మామూలు రోజే అయినా మందుబాబులకు మాత్రం అదో స్పెషల్ డే.. సిటీ శివారులో జరిగే ఈవెంట్స్‌లో పాలుపంచుకున్న వారి కోసం ముందు జాగ్రత్త చర్యగా టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సు సౌకర్యం కల్పించనుంది. ఈవెంట్స్‌కి వెళ్లే వారికోసం రాత్రి 7.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు, తిరుగు ప్రయాణం అర్థరాత్రి 12.30 నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 3 గంటల వరకు బస్సు సేవలు అందించనుంది.

18 సీట్ల ఏసీ బస్సు వెళ్లి రావడానికి రూ.4వేల ప్యాకేజీని ప్రకటించింది. ఒకరికి రూ.100 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

Tags

Next Story