TTD : వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న నగరం

hyderabad
TTD : వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న నగరం
ఘనంగా మొదలైన వైకుంఠ ఏకాదశి సంబరాలు; హైదరాబాద్‌ లో వైకుంఠ ఏకాదశి సంబరాలు షురూ; వైకుంఠ ఏకాదశికి సిద్దమవుతున్న ఆలయాలు

TTD : హైదరాబాద్ లో వైకుంఠ ఏకాదశికి ముస్తాబువుతున్నబాలాజీ ఆలయం


జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని.. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని హిమాయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు సైతం ఏకాదశి వేడుకల ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్నీ చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. నగరం నలుమూలల నుంచి దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వచ్చే భక్తులకు చలువపందిళ్లు, బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

టిటిడి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి. జగన్మోహనాచార్యులు మాట్లాడుతూ.. శ్రీమహావిష్ణువుకు ఈ వైకుంఠ ఏకాదశి ఎంతో ముఖ్యమైన రోజని, హిందువులు కూడా పవిత్రంగా భావించే రోజు అని, స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. ఇక ఈ వేడుక రోజున ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, యజ్ఞాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా విష్టుమూర్తికి సంబంధించి ప్రసంగాలు కూడా జరుగుతాయని, భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఏఈవో పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story