Tv5: ప్రజల పక్షపాతి, Tv5 చైర్మన్ బీఆర్ నాయుడు జన్మదినం.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

టీవీ5 నెట్‌వర్క్ చైర్మన్ బీఆర్ నాయుడు జన్మదినం సందర్భంగా.. తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఛానెల్ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యం బడుగు, బలహీన వర్గాల పక్షాన ఉంటూ.. వారి సమస్యల ఎజెండాగా పోరాడుతూ.. వారి కష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ.. ప్రజానీకానికి తామున్నామంటూ ధైర్యం ఇస్తున్న బీఆర్ నాయుడు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. బీఆర్ నాయుడు దంపతుల పేరు మీద గోత్ర నామాలతో పండితులు వేద మంత్రాలను పఠించారు.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలలు ఆలయ అర్చకులు ఆశీర్వదించారు.
మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీవీ5 ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న బీఆర్ నాయుడు సదా సుఖసంతోషాలతో ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు.
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. బీఆర్ నాయుడు ఆయురారోగ్యాలతో.. సుఖం సంతోషాలతో ఉండాలని.. సమాజానికి మరింత మేలు కొనసాగించాలని అర్చకులు ఆశీర్వదించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com