TV5 Daily Mirror: టీవీ5 'డైలీమిర్రర్‌' ప్రోగ్రామ్‌కు ఆరాధనా-శ్రీకరీ అవార్డు..

TV5 Daily Mirror: టీవీ5 డైలీమిర్రర్‌ ప్రోగ్రామ్‌కు ఆరాధనా-శ్రీకరీ అవార్డు..
X
TV5 Daily Mirror: ఇప్పుడు తన కీర్తి కిరీటంలో మరో పురస్కారం చేరింది. అదే ఆరాధనా-శ్రీకరీ అవార్డు.

TV5 Daily Mirror: టీవీ5లో ప్రతిష్టాత్మక కార్యక్రమం డైలీమిర్రర్. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు.. సమాజాన్ని చైతన్యం చేసే విషయాలను.. సమగ్రంగా, సవివరంగా ప్రసారం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ప్రజల ప్రశంసలను పొందింది. ఇప్పుడు తన కీర్తి కిరీటంలో మరో పురస్కారం చేరింది. అదే ఆరాధనా-శ్రీకరీ అవార్డు.

ప్రజాదరణ పొందిన కళాకారులకు, టీవీ ఛానళ్లలో ప్రేక్షకుల మెప్పు పొందిన కార్యక్రమాలకు.. ఆరాధనా-శ్రీకరీ సంస్థ ఏటా పురస్కారాలను ఇస్తుంది. ఇప్పుడు 26వ టీవీ అవార్డులను అందించింది. టీవీ5లో ప్రసారమయ్యే డైలీమిర్రర్ ను.. ఉత్తమ కార్యక్రమంగా ఎంపిక చేసింది. డైలీమిర్రర్ ప్రోగ్రామ్ కు ప్రొడ్యూసర్ గా ఉన్న U.V.గున్నేశ్వరరావు.. ఈ అవార్డును అందుకున్నారు.

టీవీ5 యాజమాన్యం అందించిన సహకారం.. ఇన్ ఛార్జులు చేసిన దిశానిర్దేశం.. సహచర సిబ్బంది అందించిన తోడ్పాటు వల్లే ఈ అవార్డు దక్కిందని గున్నేష్ చెప్పారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలుగు-హిందీ సంగీత విభావరి ఆహుతులను అలరించింది.

Tags

Next Story