నవ వధువు మృతి కేసులో మరో ట్విస్ట్!

సూర్యాపేట జిల్లాలో వరకట్నవేధింపులతో నవ వధువు మృతి చెందిన కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆమె భర్త ప్రణయ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్గొండ జిల్లా, కొర్లపహాడ్‌కు చెందిన లావణ్య సూర్యాపేటలో ప్రణయ్‌కు ఐదు నెలల కిందట వివాహం జరిగింది. కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం లావణ్యకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపుల భరించలేక ఇటీవల పుట్టింటికి వచ్చిన లావణ్య పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకుంది.
దీనితో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. లావణ్య మృతికి అత్తింటివారే కారణమని.. మృతదేహాన్నిభర్త ఇంటి ముందు ఉంచి మృతురాలి బంధువులు ధర్నా చేపట్టారు. దీంతో మనస్థాపానికి గురై భర్త ప్రణయ్ కూడా ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com