చెక్ డ్యాంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు..

చెక్ డ్యాంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు..
ఎండలు మండిపోతున్నాయి. సరదాగా చెరువుకు వెళ్లారు. స్నానం చేద్దామనుకున్నారు.

ఎండలు మండిపోతున్నాయి. సరదాగా చెరువుకు వెళ్లారు. స్నానం చేద్దామనుకున్నారు. ఈ క్రమంలో చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక చెక్ డ్యాంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నిత్య (12), కన్ని (13) మరికొంత మంది పిల్లలతో కలిసి వెళ్లారు. స్నానం చేస్తుండగా నీళ్లలో మునిగిపోయి నిత్య, కన్ని మృతి చెందారు. మరో ముగ్గురు పిల్లలు మునిగిపోతుండగా స్థానికులు కాపాడారు.

మృతి చెందిన ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు జీవచ్చవాల్లా పడి ఉన్న బిడ్డలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. వీరి స్వస్థలం జమ్మికుంట మండలం తనుగుల గ్రామం. ఎల్లమ్మ బోనాల కోసం బంధువుల ఊరైన కొండపాకకు వచ్చి చెరువులో పడి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.

Tags

Next Story