భారీ వర్షాలు.. బడికి శెలవులు..

మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం. బడికి వెళ్లే పిల్లల భద్రత ముఖ్యమని భావించిన తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ఈరోజు (గురువారం) శుక్రవారం పాఠశాలలకు సెలవు ఉంటుందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితి అదుపులో ఉన్నప్పుడే పాఠశాలలు తిరిగి తెరవబడతాయి. విద్యార్థులు, పాఠశాలల సిబ్బంది, తల్లిదండ్రులు ఈ ప్రకటనను గమనించాలని కోరారు.
భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి మట్టం పెరిగింది. గురువారం ఉదయం 9 గంటలకు 8,05,158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినప్పటికీ గోదావరి 40 అడుగుల మేర ప్రవహిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com