CM KCR : కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం : సీఎం కేసీఆర్

CM KCR : రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందించే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని, దాన్ని కొనసాగిస్తూనే, ప్రాథమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షలకోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ నిరాకరించకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు.
కరోనా పరీక్షలకు సంబంధించి రాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను తక్షణమే పెంచాలన్నారు. రేపటినుంచే అన్ని వైద్యకేంద్రాల్లో ఇప్పుడు ఇస్తున్న కిట్ల సంఖ్యను పెంచాలని, అవసరమున్న మేరకు ఉత్పత్తిదారులతో మాట్లాడి సరఫరాను పెంచాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్సకోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్ వాక్సిన్, లాక్ డౌన్ అమలు పై ఇవాళ ప్రగతిభవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com