Hyderabad: కరెంట్ షాక్‌తో ముగ్గురు ముస్లీం యువకులు మృతి

Hyderabad: కరెంట్ షాక్‌తో ముగ్గురు ముస్లీం యువకులు మృతి
X
నీటి సంప్ వద్ద మోటార్ ఆఫ్ చేయడానికి ఓ యువకుడు వెళ్లాడు. అతనికి కరెంట్ షాక్ తగిలింది. దాంతో అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు వెళ్లగా

హైదరాబాద్ షేక్‌పేట పారామౌంట్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో అన్నతమ్ముడితో పాటు స్నేహితుడు మృతి చెందారు. నీటి సంప్ వద్ద మోటార్ ఆఫ్ చేయడానికి ఓ యువకుడు వెళ్లాడు. అతనికి కరెంట్ షాక్ తగిలింది. దాంతో అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు వెళ్లగా.. వారు కూడా విద్యుత్ ఘాతానికి బలయ్యారు. వాటర్ సంప్‌లో నుండి నీటిని తోడుతుండగా ఈ ఘటన జరిగింది. మృతులు ఆనస్(19), రిజ్వాన్(18), రజాక్‌(16)గా పోలీసులు గుర్తించారు. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. మృతుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అటు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story