Medchal: తండ్రి మందలించాడని.. మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు..

X
By - Prasanna |3 Jan 2023 12:32 PM IST
Medchal: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం అయ్యారు.
Medchal: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. తండ్రి మందలించాడన్న మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
10వ తరగతి చదువుతున్న బ్రిజేష్ కుమార్, ప్రిన్స్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. ఆ ఇద్దరు ఇంట్లో ఉన్న 17వేల 500 నగదు తీసుకొని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసుల విచారణలో వారు సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లుగా తేలింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com