తెలంగాణ వాసికి యూఏఈ గోల్డెన్ వీసా

తెలంగాణ వాసికి యూఏఈ గోల్డెన్ వీసా
X
ఆమె దుబాయ్‌లోని 'తుంబే' ఆసుపత్రిలో జనరల్ ప్రాక్టీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ వాసి డాక్టర్ జ్యోత్స్న యూఏఈ గోల్డెన్ వీసా పొందారు. ఆమె దుబాయ్‌లోని 'తుంబే' ఆసుపత్రిలో జనరల్ ప్రాక్టీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2019 నుంచి ఆమె దుబాయ్ లో నివాసం వుంటున్నారు. జూన్ 29న ఆమెకు గోల్డెన్ వీసా దక్కింది.

ఈ వీసా గడువు పదేళ్ళు. వివిధ రంగాల్లో విశేష సేవలు, ప్రత్యేక నైపుణ్యం వున్నవిదేశీయులకు మాత్రమే యూఏఈ ఈ గోల్డెన్ వీసా అందిస్తుంది. 2019 నుంచి లాంగ్ టెర్మ్ రెసిడెన్సీ వీసాల మంజూరు అమల్లోకి వచ్చింది యూఏఈలో. కాగా, యూఏఈ గోల్డెన్ వీసా పొందడం పట్ల డాక్టర్ జోత్స్న హర్షం వ్యక్తం చేశారు.

Tags

Next Story