Kishan Reddy : అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్‌తో చర్చలకు సిద్ధం : కిషన్ రెడ్డి

Kishan Reddy : అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్‌తో చర్చలకు సిద్ధమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మోదీ ఏడేళ్ల పాలనపై సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో చర్చిద్దామన్నారు. చర్చలో కేసీఆర్ భాష హుందాగా ఉండాలన్నదే తన కండీషన్ అన్నారు కిషన్ రెడ్డి. బడ్జెట్‌పై కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారని ఆరోపించారు కిషన్ రెడ్డి. యూరియాపై రూపాయి కూడా పెంచలేదన్నారు. త్వరలోనే తెలంగాణలో యూరియా ఫ్యాక్టరీని మోడీ ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణ మొత్తం తనకు జీ హుజుర్ అనాలనేది కేసీఆర్ భావన అన్నారు. తన తర్వాత కుమారుడిని సీఎం చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. సీఎం కేసీఆర్ వాడుతున్న భాష దిగజారుడుగా ఉందన్నారు. కేంద్రానికి, బీజేపీకి శత్రువులు ఎవరూ లేరన్నారు. అమర జవాన్ల ఆత్మ ఘోషించేలా కేసీఆర్ మాట్లాడారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com