మోదీ పాలనలో బాంబు పేలుళ్లు, మత కల్లోలాలు ఎక్కడా లేవు : కిషన్ రెడ్డి
మోదీ పాలనలో బాంబు పేలుళ్లు, మత కల్లోలాలు, కర్ఫ్యూలు ఎక్కడాలేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తిరుపతిలో జన ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన బీజేపీ ప్రభుత్వం కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లోనే జరిగిందన్నారు. భారత్‌ను చూసి అన్ని దేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. ఆక్సిజన్ కొరతను ఆధిగమించామన్నారు. మోదీ హయాంలో ఏడేళ్ల పాలన అంతా ప్రశాంతంగా జరిగిందని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని కొనియాడారు. శ్రీవారి పాదాల చెంత ప్రధాని మోదీని ప్రజలంతా ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి కోరారు.
అంతకముందు బీజేపీ శ్రేణులు నిర్వమించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కిషన్‌రెడ్డికి... బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నేతలు సీఎం రమేష్, విష్ణువర్ధన్‌రెడ్డి, కోలా ఆనంద్, భానుప్రకాష్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం.. రేణిగుంటలోని అంబేడ్కర్ విగ్రహానికి కిషన్‌రెడ్డి నివాళులు అర్పించారు. తర్వాత కాటన్ మిల్లు నుంచి రామానుజ సర్కిల్ మీదుగా బస్టాండ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com