తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : కిషన్‌రెడ్డి

తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : కిషన్‌రెడ్డి
X
Kishan Reddy: జన ఆశీర్వాద యాత్రలో భాగంగా నాలుగవరోజు భువనగిరి పట్టణంలో ఆయన పర్యటించారు.

తెలంగాణలో ప్రజలు మార్పు కోరకుంటున్నారని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా నాలుగవరోజు భువనగిరి పట్టణంలో ఆయన పర్యటించారు. హుజురాబాద్‌ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడ చూడలేదన్నారు. కుటుంబ రాజకీయాలు చేసేవారిని రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు. భువనగిరి కోటకు ప్రత్యేకత ఉందని.. రోప్‌వే ద్వారా అభివృద్ధి చేయాల్సి అవసరముందన్నారు కిషన్‌రెడ్డి.

డిసెంబర్‌లోపు దేశమంతా వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తిచేస్తామని అన్నారు కిషన్‌రెడ్డి. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ కారణంగా పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags

Next Story