kishan Reddy : టీఆర్ఎస్ వాళ్లపై కేసులు పెడితే జైళ్లు సరిపోవు: కిషన్ రెడ్డి

kishan Reddy : టీఆర్ఎస్ వాళ్లపై కేసులు పెడితే జైళ్లు సరిపోవు: కిషన్ రెడ్డి
X
kishan Reddy : ఉద్యోగుల కోసం బండి సంజయ్ దీక్ష చేపడితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

kishan Reddy : ఉద్యోగుల కోసం బండి సంజయ్ దీక్ష చేపడితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఉద్యోగులకు అండగా నిలబడడం తప్పా అని ప్రశ్నించారు. కొవిడ్ ప్రోటోకాల్‌ గురించి టీఆర్ఎస్‌ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. రాష్ట్ర మంత్రులు మాస్కులు పెట్టుకోకుండా తిరగడం పోలీసులకు కనిపించడం లేదా అన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయంలో టీఆర్ఎస్ వాళ్లపై కేసులు పెడితే జైళ్లు సరిపోవన్నారు. మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకుని TRS పార్టీ పని చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. బండి సంజయ్‌ అరెస్టు ఘటన పోలీసు వ్యవస్థకు మాయని మచ్చ అన్నారు కిషన్ రెడ్డి.

Tags

Next Story