kishan Reddy : మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కిషన్ రెడ్డి కౌంటర్‌

kishan Reddy : మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కిషన్ రెడ్డి కౌంటర్‌
kishan Reddy : మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్‌ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. TRS ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.

kishan Reddy : మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్‌ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. TRS ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. TRS పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని ఆరోపించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఉద్యమకారులకు సరైన గౌరవం లేదన్నారు.

రుణమాఫి, దళితబంధు, పంట నష్ట పరిహారం, దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం హామీల అమలేదంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు లెక్కే లేదంటూ కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు కిషన్ రెడ్డి. అంతరకుముందు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

బీజేపీ పాలనలో ఆక్సిజన్‌ నుంచి అన్ని కొరతేనని, బొగ్గు కొరత వల్ల అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరతేనని, ఈ సమస్యలన్నింటికి ప్రధాని మోదీకి విజన్‌ కొరతే కారణం అంటూ విమర్శించారు.

Tags

Next Story