జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై కిషన్‌రెడ్డి అసహనం

జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై కిషన్‌రెడ్డి అసహనం
X

హైదరాబాద్‌లోని వరద ప్రబావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. బాధితులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నాంపల్లి, హిమాయత్‌నగర్‌తో పాటు ఇతర నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు.

వరద సహాయ చర్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హిమాయత్‌నగర్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. సమస్యల పరిష్కారంపై మాట్లాడేందుకు సంబంధిత అధికారులు ఎవరూ రాకపోవడంపై మండిపడ్డారు. తాను ఢిల్లీ వెళ్లిపోవాలా అంటూ ప్రశ్నించారు. తన పర్యటనకు తహశీల్దార్ స్థాయి కూడా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాలపై పడిన చెట్లు, చెత్త తొలగించకపోవడంపై జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

Tags

Next Story