గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని పరిశీలించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని ఆస్పత్రులను సందర్శిస్తున్నారు. నిన్న గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రులను పరిశీలించిన కిషన్ రెడ్డి.. ఇవాళ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు.. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యం, సదుపాయాలపై ఆరా తీశారు.. ఆస్పత్రి మొత్తం కలియతిరిగారు.. పీఎం కేర్స్ ఫండ్ కింద కేంద్రం ఇచ్చిన 200 వెంటిలేటర్స్‌లో 100 ఇంకా ఖాళీగా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి.
టిమ్స్‌లో బెడ్స్, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత లేదన్నారు.. ప్రభుత్వం వెంటనే జీవో ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్‌ఆర్బీ ఆక్సిజన్ మాస్కుల కొరత లేకుండా చూస్తానని చెప్పారు. ఇక టెస్ట్ కిట్స్ కొరత ఎంత మాత్రం లేదన్న కిషన్ రెడ్డి.. టిమ్స్ సెకండ్ ఫ్లోర్‌లో రెండో ఐసీయూ, ఇతర వార్డులు ఏర్పాటు చేయవచ్చని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com