బీఆర్‌ఎస్‌లో ఎగిసిపడుతున్న అసంతృప్తి జ్వాలలు

బీఆర్‌ఎస్‌లో ఎగిసిపడుతున్న అసంతృప్తి జ్వాలలు

బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు రహస్య సమావేశాలు నిర్వహిస్తుండగా.. మరికొందరు నేతల్ని సీనియర్లు బుజ్జగిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్‌లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామా నాగేశ్వరరావు భేటీ అయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో గంటకు పైగా చర్చలు జరిపారు. తుమ్మల అలకవీడి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

రాజయ్యకు బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. హన్మకొండలో రాజయ్యను కలవడానికి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో రాజయ్య ఇంట్లో లేరు. దీంతో పల్లా వెనుతిరిగారు.

కోదాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జ్‌ శశిధర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అభ్యర్థిని మార్చకుంటే ముక్కుమ్మడిగా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్దమని వారు హెచ్చరించారు. కోదాడ అభ్యర్థిగా బోల్లం మల్లయ్యను ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

Tags

Next Story