హైదరాబాద్‌లో మరో ఐటీ హబ్.. పది లక్షల మందికి ఉద్యోగాలు..

IT Parks in Hyderabad: హైదరాబాద్‌లో ఐటీ హబ్‌లు రాజధాని నలుమూలలా విస్తరిస్తున్నాయి.. రానున్న కాలంలో మరో ఐటీ హబ్ రూపాంతరం చెందనుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉన్న ఈ పరిసర గ్రామాల్లో ఐటీ హబ్‌కు అనుకూలంగా ఉందని తెలిపింది.
ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 640 ఎకరాల భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ గుర్తించింది. హైటెక్ సిటీ తరహాలో ఈ హబ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ రూపొందించిన ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఇందుకోసం సమీకరించే భూములకుగాను భూ యజమానులకు ఎకరాకు 600 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల ద్వారా దాదాపు పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని ప్రాథమిక అంచనాగా హెచ్‌ఎండీఏ నివేదికలో పేర్కొంది. ఐటీ అనుబంధ సేవా రంగాలు కూడా అక్కడ భారీగా విస్తరించే అవకాశం ఉందని భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com