Phoenix: ఫీనిక్స్ ఆఫీసుల్లో కీలక ఆధారాలు సేకరించిన ఐటీ అధికారులు..

Phoenix: ఫీనిక్స్ ఆఫీసుల్లో కీలక ఆధారాలు సేకరించిన ఐటీ అధికారులు..
Phoenix: తెలంగాణలో కొద్ది రోజులుగా బడా రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.

Phoenix: తెలంగాణలో కొద్ది రోజులుగా బడా రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మొన్న వాసవి గ్రూప్‌పై దాడులు చేయగా.. నిన్న ఫీనిక్స్ గ్రూప్‌ను టార్గెట్ చేశారు. ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఐటీ సోదాలతో వ్యాపార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేశారు. ఫీనిక్స్ సంస్థ అధినేత చుక్కపల్లి సురేష్‌తో పాటు డైరెక్టర్ల ఇళ్లతో పాటు సంస్థ ఛైర్మన్ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మాదాపూర్‌, నానక్‌రాంగూడ, గోల్ఫ్‌ఎడ్జ్‌ ఇలా అన్ని ఆఫీసుల్లో ఆకస్మిక దాడులు చేశారు ఐటీ అధికారులు.

మంగళవారం ఉదయం 25 వాహనాల్లో వచ్చిన ఐటీ ఆధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఫీనిక్స్ సంస్థ అనేక వెంచర్లు, రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రాలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు వెలుగులోకి వచ్చాయి. వేల కోట్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాల్ని హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహిస్తున్న ఈ సంస్థలు జాయింట్ వెంచర్లు కూడా వేశాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, బడాబాబులు ఇందులో భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు ఐటీ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం.

ఈ సంస్థ కార్యకలాపాలపై కొంతకాలంగా నిఘాపెట్టిన ఐటీ శాఖ.. పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫీనిక్స్‌ సంస్థ ఛైర్మన్‌ చుక్కపల్లి సురేష్‌ జన్మదిన వేడుకలు నగరంలోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగాయి. బర్త్‌ డే వేడుకలకు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, కలెక్టర్లు, బాలీవుడ్‌, టాలీవుడ్‌ స్టార్లు హాజరయ్యారు. కాగా, బర్త్‌ డే వేడుకలకు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించారు. మొత్తానికి హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలపై వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు హాట్‌టాపిక్‌గా మారాయి. వాసవి గ్రూప్‌లో జరిపిన సోదాల్లో దొరికిన ఆధారాలతోనే ఫీనిక్స్ గ్రూప్‌లో సోదాలు నిర్వహించారు. మరి ఇక్కడ దొరికే లెక్కలు .. ఏ సంస్థ, ఏ వ్యక్తి బాగోతాన్ని బయటపెడుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story