UPSC : సివిల్స్ పరీక్షల్లో మెరిసిన తెలుగు తేజాలు

UPSC : సివిల్స్ పరీక్షల్లో మెరిసిన తెలుగు తేజాలు
X

ఆలిండియా సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించారు.. గత ఏడాది టాప్‌లో అమ్మాయిలే నిలవగా ఈసారి కూడా వారే సత్తా చాటారు.. తొలి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు.. ఇషితా కిషోర్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించగా.. గరిమ లోహియా సెకండ్‌ ర్యాంక్‌, ఉమా హారతి మూడో ర్యాంక్‌, స్మృతి మిశ్రా నాలుగో ర్యాంక్‌ సాధించారు.

తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకు సాధించారు.. శాఖమూరి శ్రీసాయి అశ్రిత్‌ 40వ ర్యాంకు, సాయి ప్రణవ్‌ 60వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన నిధి పాయ్‌ 110వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157వ ర్యాంకు సాధించగా.. కమతం మహేశ్‌కుమార్‌ 200వ ర్యాంకు గెలుచుకున్నారు. రావుల జయసింహారెడ్డి 217, విశాఖకు చెందిన సాహిత్య 243కు ర్యాంకు వచ్చింది. అంకుర్‌ కుమార్‌కు 257వ ర్యాంకు, బొల్లం ఉమామహేశ్వర రెడ్డికి 270వ ర్యాంకు, చల్లా కళ్యాణికి 285వ ర్యాంకు, పాలువాయి విష్ణువర్ధన్‌ రెడ్డికి 292వ ర్యాంకు, గ్రంధె సాయికృష్ణకు 293వ ర్యాంకు వచ్చింది.

2022 ఏడాదికి గాను మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ - ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది.

నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. 2021లో ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌లో 12వ ర్యాంకు సాధించిన ఉమా హారతి.. శిక్షణ పూ్తి చేసుకుని ఈనెల 22న విధుల్లో చేరారు.. ఇప్పుడు సివిల్స్‌లో ఆలిండియా థర్డ్‌ ర్యాంక్‌ సాధించడంతో ఉమా హారతి సంతోషానికి అవధుల్లేవు.

Tags

Next Story