తెలుగు విద్యార్థినికి US కాలేజీ రూ.2 కోట్ల స్కాలర్‌షిప్..!

తెలంగాణాకు చెందిన శ్వేతా రెడ్డి(17) అనే విద్యార్థినికి అమెరికాలో ఓ ప్రముఖ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసింది. ఆ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. డైయర్ ఫెలోషిప్ పేరిట కాలేజీ ఇచ్చే ఈ స్కాలర్‌షిప్‌కు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరుగురు ఎంపికవగా అందులో శ్వేతారెడ్డి ఒకరు.
హైస్కూల్ స్థాయిలో శ్వేతారెడ్డి కనబరిచిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను మెప్పించాయని సదరు కాలేజీ యాజమాన్యం తెలిపింది. కాగా.. ఈ స్కాలర్‌షిప్ సాధించడం పట్ల శ్వేత హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత అవకాశం రావడం వెనుక నాలుగేళ్ళ కృషి ఉందని వెల్లడించింది. శిక్షణ తీసుకునే సమయంలో నాయకత్వ పటిమతో పాటు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలిగానని శ్వేత పేర్కొన్నారు.
కేరిర్‌లో తనకు సహకరించిన వారికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆమె తెలిపింది. కాగా శ్వేతకు స్కాలర్‌షిప్ రావడం పట్ల కోచింగ్ ఇచ్చిన సీఈవో హర్షం వ్యక్తం చేశారు. రాబోయే తరాల నాయకులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేరీర్‌కు సంబంధించి తన సంస్థ ఇచ్చిన ట్రెయినింగ్‌తో ఎంతో మంది కొలంబియా, యేల్ యూనివర్శిటీ, జార్జి టౌన్, టఫ్ట్స్, కేస్ వెస్టర్న్, నార్త్‌వెస్టర్న్, యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, బోస్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్, తదితర ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com