మోదీ రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా..? : ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీజేపీ నేతల ప్రవర్తన హైదరాబాద్ వాసులను అవమాన పరిచేలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వరదల్లో వంద మంది చనిపోతే.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పరామర్శించేందుకు రాలేదని అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల లో ఓట్ల కోసం వస్తారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ.. కరోనా వ్యాక్సిన్ పరిశీలన పేరుతో డ్రామా చేస్తున్నారని అన్నారు. మోదీ రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా..? అని ప్రశ్నించారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని అన్నారు. యూపీ సీఎం.. సొంత రాష్ట్రంలో దళిత మహిళలపై దాడులు జరిగినా స్పందించడం లేదని, హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ఉత్తమ్ ప్రశ్నించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com