రైతులను మోసం చేసిన కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు : ఉత్తమ్‌

రైతులను మోసం చేసిన కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు : ఉత్తమ్‌

కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.. పార్టీ తరఫున తాము ఏం చేయాలన్నదానిపై కార్యాచరణ రూపొందించామని చెప్పారు. రైతులను మోసం చేసిన కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కు లేదన్నారు. తెలంగాణలో ఎక్కువ జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి ఉందని, అలాంటి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యతను ప్రభుత్వం గుర్తించేలా కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమం చేస్తుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.


Tags

Next Story