ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దిగజారి ప్రవర్తిస్తుంది : ఉత్తమ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దిగజారి ప్రవర్తిస్తుంది : ఉత్తమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దిగజారి ప్రవర్తిస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఓటర్లను బెదిరించి టీర్ఆఎస్ కు ఓటు వేయాలని ప్రమాణాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దిగజారి ప్రవర్తిస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఓటర్లను బెదిరించి టీర్ఆఎస్ కు ఓటు వేయాలని ప్రమాణాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు రాలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వామనరావు దంపతుల హత్యను ఇంతవరకు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఉత్తమ్ తెలిపారు. శంకరమ్మను బలి చేసినట్లే పీవీ కుమార్తె వాణీని బలిచేయటానికే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story