V Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్‌చల్.. పోలీస్ గన్‌తో గాల్లో కాల్పులు..

Srinivas Goud: మహబూబ్‌నగర్ ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్‌చల్ చేశారు. పోలీసుల SLR వెపన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. కానిస్టేబుల్ వెపన్ తీసుకున్న మంత్రి.. రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి ఫైరింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాల్పుల ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రికి గన్ ఇచ్చిన కానిస్టేబుల్ ఎవరు..? తుపాకీలో ఉన్నవి డమ్మీ బులెట్లా..? లేక ఉత్సవాల సందర్భంగా కాల్పులు జరిపే బుల్లెట్లా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది.
వీడియో వైరల్ అవడంతో వివరణ ఇచ్చుకున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్వయంగా ఎస్పీనే తనకు గన్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. కాల్చింది రబ్బరు బుల్లెట్లే అని.. ఇలా చాలా సార్లు కాల్చానన్నారు. ఇక స్పోర్స్ట్ మీట్‌లో ఇలా రబ్బర్ గన్ పేల్చడం సహజమే అంటున్నారు శ్రీనివాస్ గౌడ్. పోలీసుల తుపాకీ లాక్కుంటే వారు ఊరుకుంటారా అని ఉల్టా ప్రశ్నిస్తున్నారు మంత్రి. తాను ఆలిండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్నని.. గన్‌కు సంబంధించిన నిబంధనలన్నీ తనకు తెలుసంటున్నారు శ్రీనివాస్ గౌడ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com