Rajanna Siricilla district : టీకా వేస్తే కేసు పెడతా.. వైద్యసిబ్బందిపై తిరగబడ్డ మహిళ

Rajanna Siricilla district : రెండు వ్యాక్సిన్ డోసులతోనే కరోనా నుంచి రక్షణ అని... టీకాలతో ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవని వైద్యులు, నిపుణులు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు.. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. మాకు ఎలాంటి రోగాలు లేవు, వ్యాక్సిన్ వేసుకోమంటే వేసుకోమని మొండికేస్తున్నారు.
ఇది ఎంత వరకు వెళ్లిదంటే.. వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో కేసు పెడతామనేంత వరకు... అవును, వ్యాక్సిన్ వేసుకోవాలని బలవంత పెడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడతామని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో కొందరు మహిళలు సిబ్బందిపై రివర్స్ అయ్యారు.
గ్రామంలో సర్పంచ్ ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తూ టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లకు ప్రభుత్వ పథకాలు రావని చెబుతున్నారు. ఈక్రమంలోనే గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లగా.. ఆ ఇంట్లో వారు సర్పంచ్ కే షాకిచ్చారు. తమకు ఏ పథకాలు వద్దని.. బలవంతం చేస్తే కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో చేసేదేం లేక సర్పంచ్ వెనుదిరిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com